ఎలా వ్యవహరించాలి
మీరు ఏదైనా చూసినట్లయితే, దాని గురించి చెప్పండి.
ఎవరైనా హద్దు మీరినప్పుడు మరియు, వారు ఎప్పుడు చేశారనేది మీకు తెలుసు — మేం దాని గురించి తెలుసుకోవాలని అనుకుంటాం, ఎందుకంటే కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి Tinderని ఒక సురక్షితమైన మార్గంగా చేయడానికి సాయపడాలని మేం కోరుకుంటున్నాం: మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసిన, లైంగిక నేరస్థుల రిజిస్ట్రీలో జాబితా చేయబడ్డ లేదా మా మార్గదర్శకాలను ఉల్లంఘించే, తీవ్రమైన నేరం చేసిన, లేదా ఇంతకు ముందు అటువంటి ప్రవర్తనలు కలిగి ఉన్నట్లుగా మీ వ్యక్తిగత అనుభవం ద్వారా మీరు తెలుసుకున్నట్లయితే యాప్ ద్వారా మీరు ఎవరినైనా రిపోర్ట్ చేయవచ్చు. ఎవరైనా అసమంజసంగా వ్యవరించడాన్ని మాకు తెలియజేయడానికి ఇది సురక్షితమైన మార్గం, మరియు ఇది గోప్యంగా ఉంచబడుతుంది.
మేం మీ కోసం ఉన్నాం. మేం వేధింపులను చాలా తీవ్రంగా పరిగణిస్తాం మరియు, స్పష్టంగా చెప్పాలంటే, Tinderపై అటువంటి వాటిని మేం కోరుకోం. వ్యక్తులను మేం ఎందుకు నిషేధిస్తాం అనేదానికి ఇవిగో కొన్ని ఉదాహరణలు:
జాతి విద్వేష మాటలు లేదా ఇతర అసభ్యకరమైన భాష
యాప్‌పై మరియు యాప్ వెలుపల బెదిరించే లేదా అభ్యంతరకరమైన సందేశాలు పంపడం
యాప్‌లో లేదా వెలుపల మీ మ్యాచ్‌లను వేధించడం
మీ మ్యాచ్‌ల సమ్మతి లేకుండా యాప్ పైన లేదా వెలుపల లైంగిక ప్రవృత్తి కలిగిన కంటెంట్ పంపడం
వాణిజ్య వెబ్‌సైట్‌లకు లింక్‌లు లేదా ప్రొడక్ట్‌లు లేదా సర్వీస్‌లను విక్రయించడంతో సహా స్పామ్ లేదా కొనుగోలు అభ్యర్థనలు పంపడం