Tinder వద్ద భద్రత
మానవ అనుసంధానపు మాయాజాలాన్ని సజీవంగా ఉంచేందుకు సురక్షితమైన మరియు నమ్మకమైన ప్రదేశం!
ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన సంస్థను రూపొందించడానికి, మా సభ్యులకు కొత్త మానవ అనుసంధాన మ్యాజిక్‌ని సజీవంగా ఉంచుకునేందుకు ఒక ప్రైవేట్ మరియు సురక్షితమైన ప్రదేశాన్ని అందించేలా చూడటమే Tinder సెక్యూరిటీ టీమ్ మిషన్.
మీ సమాచారంతో మీరు Tinderని విశ్వసించారు కనుక, మా అప్లికేషన్ సెక్యూరిటీ మరియు మీ డేటా గోప్యత మాకు అత్యంత ప్రాధాన్యతాంశాలు. మేం దృఢమ ైన, పారదర్శకమైన మరియు జవాబుదారీ భద్రతా కార్యక్రమాన్ని నిర్వహించేలా చూసుకోవడం మీ పట్ల మా నిబద్ధతకు ఎంతో కీలకమైనది.
అంతర్గత Tinder భద్రతా విధానాలు
ఇంటర్నెట్ సేవలు మరియు మౌలిక సదుపాయాలు అసంఖ్యాక బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో Tinder భద్రతా కార్యక్రమం ప్రముఖ భద్రతా మౌలిక సదుపాయాలు, బాధ్యతాయుతమైన డేటా విధానాలు, అదేవిధంగా ముందు ఉండటానికి భద్రత మరియు గోప్యతల అత్యుత్తమ విధానాలను ఉపయోగించి మా సంస్థ మరియు మీ డేటాను ప్రతి దశలోనూ సంరక్షిస్తుంది.
మా భద్రతా కార్యక్రమం దిగువ డొమైన్‌లపై దృష్టి కేంద్రీకరిస్తుంది:
భద్రతా కార్యక్రమంపై అంతర్గత సమాచారం: Tinder డిజిటల్ వాతావరణంలో సెక్యూరిటీని పెంచడానికి మరియు ప్రమాదాన్ని తగ్గించడానికి మేం కృషి చేస్తాం. తాజా ప్రివిలేజ్ విధానాలను ఉపయోగించి, Tinder ఫెసిలిటీలు, సిస్టమ్‌లు మరియు వనరుల అంతర్గత యాక్సెస్‌ని క్రమబద్ధంగా నియంత్రించడానికి, మేం సానుకూలంగా సురక్షిత యాక్సెస్ ప్రోటోకాల్స్ మరియు నెట్‌వర్క్ఆర్కిటెక్చర్‌లను రూపొందించాం. Tinder అంతర్గతంగా రెండు-అంచెల ప్రమాణీకరణ (2FA)ని అమలు చేస్తుంది.
అప్లికేషన్ / మౌలిక సదుపాయం సెక్యూరిటీ: మెరుగైన, సురక్షితమైన ప్రొడక్ట్‌లను సృష్టించడానికి, అదేవిధంగా సురక్షితమైన డిజైన్ మరియు ఇంజినీరింగ్ సూత్రాలను ధృవీకరించేందుకు సాయపడటానికి మా డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ యొక్క అన్నీ స్థాయిల్లో సెక్యూరిటీ ఇంజినీరింగ్ చేయబడింది మరియు ఇంటిగ్రేట్ చేయబడింది. కొత్త ఫీచర్‌లు, కోడ్ మరియు కాన్ఫిగరేషన్ మార్పులతో సహా మా అప్లికేషన్‌లు మరియు సిస్టమ్‌లు, మా అంతర్గత టీమ్‌ల ద్వారా విస్త్రృతమైన సెక్యూరిటీ డిజైన్ సమీక్షలు మరియు అసెస్‌మెంట్‌లను ఎదుర్కొంటాయి. అదనంగా, ఈ అప్లికేషన్‌లు మరియు సిస్టమ్‌లలో చాలా వరకు విశ్వసనీయమైన తృతీయపక్ష సెక్యూరిటీ నిపుణుల ద్వారా రొటీన్‌గా స్వతంత్ర మరియు కఠినమైన పెన్ టెస్ట్‌లను ఎదుర్కొంటాయి.
గవర్నెన్స్, రిస్క్ మరియు కాంప్లయన్స్:Tinderలో, భద్రతా అవగాహన మొదటి రోజున ప్రారంభం అవుతుంది మరియు తరువాత ఇది ఒక నిరంతర ప్రక్రియ వలే ఉంటుంది. ఉద్యోగులు వారు ప్రారంభించేటప్పుడు అదేవిధంగా వార్షికంగా భద్రత మరియు గోప్యతా శిక్షణ పొందుతారు. Tinderలో భద్రత ప్రతిఒక్కరి బాధ్యత. మా సిస్టమ్‌లు, సభ్యుల డేటాను సురక్షితం చేయడానికి మేం భౌతిక, కార్యాచరణ, సాంకేతిక నియంత్రణలను అమలు చేశాం, అదేవిధంగా భద్రతా పాలసీలు మరియు ప్రక్రియలను కూడా అమలు చేశాం. విస్రృతమైన అంతర్గత సెక్యూరిటీ రిస్క్ మదింపులు చేయడానికి అదనంగా, మా తృతీయపక్ష వెండర్‌ల భద్రతను కూడా మేం లోతుగా సమీక్షిస్తాం.
రెడ్ టీమ్/అఫెన్సివ్ భద్రత: మా అంతర్గత రెడ్ టీమ్ అఫెన్సివ్ సెక్యూరిటీ టెస్టింగ్ ద్వారా ప్రస్తుత సిస్టమ్‌లు మరియ ు వర్క్‌ఫ్లోలో ఇంతకు ముందు తెలియని భద్రతా బలహీనతలను గుర్తిస్తుంది. ఈ గ్రూపు కంపెనీ అన్ని ప్రాంతాల్లో నిజ ప్రపంచ దాడులను అనుకరిస్తుంది, అత్యధిక ప్రమాదకర ప్రాంతాలను పరిష్కరించడానికి తన భద్రతా విధానాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఇస్తుంది. సంభావ్యఎక్స్‌ప్లోజర్‌లపై అవలోకనాలను పొందడం, మరియు ఉల్లంఘన జరిగే అవకాశాలను తగ్గించడానికి నిరంతరం పరీక్షించడమే మా లక్ష్యం.
పర్యవేక్షణ మరియు థ్రెట్ మేనేజ్‌మెంట్: మా మౌలిక సదుపాయాలు మరియు సిస్టమ్‌లకు యాక్సెస్ నిరంతరం లాగ్ చేయబడుతుంది మరియు పర్యవేక్షించబడుతుంది. Tinder యొక్క భద్రతా పర్యవేక్షణ, దర్యాప్తు, ముప్పును వెంటాడటం మరియు ప్రతిస్పందన కార్యక్రమం మేము భద్రతా సంఘటనలపై అప్రమత్తంగా ఉండటంతో పాటు తగిన విధంగా దర్యాప్తు చేయడం, ప్రాధాన్యతను నిర్ణయించడం మరియు పరిష్కరించడాన్ని నిర్ధారిస్తుంది.
కాంప్లయన్స్ సర్టిఫికేట్‌లు, స్టాండర్డ్‌లు, రెగ్యులేషన్‌లు
Tinder అంతర్జాతీయంగా ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా సమగ్ర సమాచార భద్రత మరియు గోప్యతా పద్ధతులకు గుర్తింపు పొందిన మొట్టమొదటి డేటింగ్ యాప్, ఇది మా సమాచార భద్రత మరియు గోప్యతా నిర్వహణ వ్యవస్థ కోసం ISO 27001:2022, ISO 27017:2015 మరియు ISO 27701:2019 సర్టిఫికేట్‌లను సాధించింది.
మేము SOX మరియు PCI-DSS భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికి స్వతంత్ర సంస్థల ద్వారా వార్షిక ఆడిట్‌లను కూడా నిర్వహిస్తాము.
భద్రతా బలహీనతలను నివేదించడం
సంభావ్య సమస్యలు గుర్తించడానికి, మరియు మా అప్లికేషన్‌లు, మౌలిక సదుపాయాలు మరియు సభ్యుల డేటాను మెరుగుపరిచే మార్గాలను గుర్తించడంలో సెక్యూరిటీ రీసెర్చ్ కమ్యూనిటీ నుంచి Tinder ఇన్‌పుట్‌లను స్వాగతిస్తోంది. బహిర్గతమయ్యే ఏవైనా సంభావ్య బలహీనతలను మా [బగ్ బౌంటీ ప్రోగ్రామ్] కు బాధ్యతాయుతంగా వెల్లడించాలని మేం సెక్యూరిటీ పరిశోధకులను ప్రోత్సహిస్తున్నాం. మేం భద్రతా సమస్యలను బాధ్యతాయుతంగా మరియు సకాలంలో పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. మా సభ్యులను సంరక్షించడానికి, సంభావ్య బలహీనతల గురించిన సమాచారాన్ని, సమీక్షించి, మీతో కలిసి వాటిని పరిష్కరించేంత వరకు Tinder వెలుపల ఉండే ఎవరితోనైనా సమాచారం పంచుకోకుండా సంయమనం పాటించాలని మేం మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాం. Tinderని మా సభ్యుల కొరకు సురక్షితంగా ఉంచడంలో సాయపడినందుకు మేం మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం.
ప్రశ్నలు, ఆందోళనలు లేదా మీ ప్రొఫైల్‌కు సంబంధించిన సమస్యల కొరకు లేదా మరో సభ్యుడు లేదా ప్రొఫైల్‌ని రిపోర్ట్ చేయడానికి, మా సపోర్ట్ టీమ్‌ని సంప్రదించడానికి, దయచేసి https://www.help.tinder.com/ ని సందర్శించండి.