ఎలా రిపోర్ట్ చేయాలి
ఎవరినైనా యాప్‌లో రిపోర్ట్ చేయడానికి విభిన్న మార్గాలున్నాయి.
మీ మ్యాచ్‌కు ముందు రిపోర్ట్ చేయండి
సంభావ్య మ్యాచ్‌ల కొత్త ప్రొఫైల్స్ వీక్షించేటప్పుడు…
- వ్యక్తి ప్రొఫైల్ ఓపెన్ చేయండి
- దీర్ఘవృత్తాకార ఐకాన్ మీద తట్టండి
- రిపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి
మీ మ్యాచ్ తరువాత రిపోర్ట్ చేయండి
మీ మ్యాచ్ లిస్ట్‌పై…
- మెసేజ్ స్క్రీన్‌ని తెరవండి
- దీర్ఘవృత్తాకార ఐకాన్ లేదా షీల్డ్ ఐకాన్ మీద తట్టండి
- రిపోర్ట్ చేయడానికి ఆప్షన్ ఎంచుకోండి
ఆఫ్‌లైన్ ప్రవర్తన రిపోర్ట్ చేయండి
ఆఫ్‌లైన్‌లో జరిగిన దేనినైనా మీరు మాకు రిపోర్ట్ చేయాలని అనుకున్నట్లయితే: దయచేసి మాకు రాయండి మరియు దిగువ సమాచారాన్ని చేర్చండి:
- రిపోర్ట్ చేయడానికి కారణం:
- మీరు రిపోర్ట్ చేస్తున్న ప్రొఫైల్ మీద కనిపించే ఖచ్చితమైన పేరు, వయస్సు, బయో, మరియు ఫోటోలు (స్క్రీన్‌షాట్‌లు బెస్ట్)
- ఆ వ్యక్తి ఉండే ప్రదేశం, ఫోన్ నెంబరు, ఇమెయిల్ చిరునామా మరియు/లేదా వారి Facebook అకౌంట్‌కు లింక్‌తో సహా సహాయపడగల ఇతర సమాచారం.
మేం రిపోర్ట్‌లను తీవ్రంగా పరిగణిస్తాం. మీరు ఎంత ఎక్కువగా వివరాలు అందిస్తే, ఫిర్యాదు చేసిన ప్రొఫైల్ లేదా వ్యక్తిని మేం అంత త్వరగా గుర్తిస్తాం మరియు పరిశోధిస్తాం.
మీరు అన్‌మ్యాచ్ చేసిన లేదా మిమ్మల్ని అన్‌మ్యాచ్ చేసిన ఎవరినైనా రిపోర్ట్ చేయడం
మీ మ్యాచ్ మీ సందేశం స్క్రీన్‌పై ఇక ఏమాత్రం కనిపించనప్పటికీ, మీరు వారిని ఆన్‌లైన్‌లో రిపోర్ట్ చేయవచ్చు. మా టీమ్ దానిని పరిశీలించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ధారిస్తుంది.
ఏది రిపోర్ట్ చేయాలి
మేం మా కమ్యూనిటీ భద్రత విషయాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం - మేం కొత్త వ్యక్తులను కలుసుకునేందుకు, వారితో సరదాగా గడపడానికి Tinderని అత్యుత్తమ ప్రదేశం చేయాలని మేం కోరుకుంటున్నాం. మీరు Tinderపై మొరటుగా, అసమంజసంగా లేదా చిరాకు కలిగించిన వ్యక్తితో మీరు ఇంటరాక్ట్ అయినట్లయితే, దయచేసి మాకు తెలియజేయండి. Tinderపై మేం ఏమి చేస్తాం మరియు ఏమి అనుమతించం అనేదాని గుర్తు చేసుకోవడానికి, మా కమ్యూనిటీ మార్గదర్శకాలను చదవండి.