- కమ్యూనిటీ వనరులు
- భద్రతా చిట్కాలు
భద్రతా చిట్కాలు
కొత్త వ్యక్తులను కలవడం ఉత్సాహంగా ఉంటుంది, కానీ మీకు తెలియని వారితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మీరు మీ మొదటి సందేశా న్ని పంపుతున్నా లేదా వ్యక్తిగతంగా కలుస్తున్నా మీ ఉత్తమ నిర్ణయాన్ని ఉపయోగించండి మరియు మీ భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల చర్యలను మీరు నియంత్రించలేనప్పటికీ, మీ Tinder అనుభవ సమయంలో సురక్షితంగా ఉండేందుకు మీరు చేయగలిగే కొన్ని అంశాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ భద్రత
ఎన్నటికీ డబ్బు పంపవద్దు లేదా ఫైనాన్షియల్ సమాచారాన్ని పంచుకోవద్దు
వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారని చెబుతున్నప్పటికీ వైర్ ట్రాన్స్‌ఫర్, బ్యాంకింగ్ సర్వీస్ లేదా మీ ఫోన్‌లోని యాప్ ద్వారా ఎన్నటికీ డబ్బు పంపవద్దు. ఈ లావాదేవీలను రద్దు చేయడం లేదా డబ్బు ఎక్కడికి వెళ్లిందో గుర్తించడం దాదాపు అసాధ్యం. మీరు మ్యాచ్ చేసిన వారితో లేదా వారు సిఫార్సు చేసిన సేవలు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా పెట్టుబడులు పెట్టవద్దు లేదా ఖాతాలు తెరవద్దు. మీ ఫైనాన్షియల్ ఖాతాలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే సమాచారాన్ని ఎప్పుడూ షేర్ చేయవద్దు. డబ్బు కోసం మరొక యూజర్ మిమ్మల్ని అడిగితే, వెంటనే వారిని మాకు రిపోర్ట్ చేయండి. రొమాన్స్ స్కామ్‌లను నివారించడానికి చిట్కాల కోసం, కొన్ని U.S ఫెడరల్ ట్రేడ్ కమిషన్ నుండి సలహాలును చూడండి.మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి
మీ సోషల్ సెక్యూరిటీ నంబర్, ఇల్లు లేదా వర్క్ చిరునామా, లేదా మీ రోజువారీ దినచర్య (ఉదాహరణకు, ప్రతి సోమవారం మీరు నిర్దిష్ట జిమ్‌కు వెళ్లడం) వంటి వ్యక్తిగత సమాచారాన్ని మీకు తెలియని వ్యక్తులతో ఎన్నటికీ పంచుకోవద్దు. మీరు పేరెంట్ అయితే, మీ ప్రొఫైల్‌లో మరియు మీ ప్రారంభ కమ్యూనికేషన్‌లలో మీ పిల్లల గురించి మీరు పంచుకునే సమాచారాన్ని పరిమితం చేయండి. మీ పిల్లల చిత్రాలు, వారి పేర్లు, వారు ఏ పాఠశాలకు వెళతారు లేదా వారి వయస్సు లేదా జె ండర్లు వంటి వివరాలను పంచుకోవడాన్ని మానుకోండి.ప్లాట్‌ఫారమ్‌లో ఉండండి
మీరు మరొకరి గురించి తెలుసుకునేటప్పుడు సంభాషణలను Tinder ప్లాట్‌ఫారమ్‌లో ఉంచండి. Tinderలో ఎక్స్‌చేంజ్‌లు మా నమ్మకం & భద్రత డిటెక్షన్‌లకు అనుగుణంగా ఉన్నందున, చెడు ఉద్దేశాలు ఉన్న యూజర్‌లు తరచుగా సంభాషణను టెక్స్ట్, మెసేజింగ్ యాప్‌లు, ఇమెయిల్ లేదా ఫోన్‌కు వెంటనే తరలించడానికి ప్రయత్నిస్తారు.సుదూర మరియు విదేశీ సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండండి
మీ దేశానికి చెందిన వారమని, కానీ వేరొక చోట ఇరుక్కుపోయామని చెప్పుకునే స్కామర్‌ల పట్ల జాగ్రత్త వహించండి, ప్రత్యేకించి వారు స్వదేశానికి తిరిగి రావడానికి ఆర్థిక సాయం కోసం అడిగితే జాగ్రత్త వహించండి. వారు పంచుకునే సేవ లేదా వెబ్‌సైట్‌తో పెట్టుబడి పెట్టడం లేదా ఖాతాను తెరవడం గురించి మ్యాచ్‌ను మీతో మాట్లాడనివ్వకండి. వ్యక్తిగతంగా కలవని లేదా ఫోన్/వీడియో కాల్‌లో మాట్లాడని వారి పట్ల జాగ్రత్తగా ఉండండి—వారు ఎవరు అని చెప్పారో వారు కాక పోవచ్చు. ఎవరైనా మీ ప్రశ్నలను దాటవేస్తుంటే లేదా ముందుగా మిమ్మల్ని కలవకుండా లేదా మీ గురించి తెలుసుకోకుండా సీరియస్ రిలేషన్‌షిప్ కోసం ఒత్తిడి చేస్తుంటే, అది రెడ్ ఫ్లాగ్.అన్ని అనుమానాస్పద మరియు అభ్యంతరకర ప్రవర్తనను రిపోర్ట్ చేయండి
ఎవరైనా హద్దు దాటినప్పుడు మీకు తెలుస్తుంది. మరియు వారు అలా చేసినప్పుడు, దాని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మా నిబంధనలను లేదా మీ వ్యక్తిగత హద్దులను ఉల్లంఘించే ఎవరినైనా బ్లాక్ చేయండి మరియు రిపోర్ట్ చేయండి. ఉల్లంఘనల యొక్క కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి:డబ్బు లేదా విరాళాల కోసం అభ్యర్థనలు
వయస్సు తక్కువ యూజర్‌లు
వేధింపులు, బెదిరింపులు మరియు అభ్యంతరకర సందేశాలు
వ్యక్తిగతంగా కలిసినప్పుడు లేదా ఆ తర్వాత అనుచిత లేదా హానికర ప్రవర్తన
మోసపూరిత ప్రొఫైల్‌లు
వాణిజ్య వెబ్‌సైట్‌లకు లింక్‌లు లేదా ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రయత్నాలతో సహా స్పామ్ లేదా విన్నపం
మీరు ఏదైనా ప్రొఫైల్ పేజీ లేదా మెస్సేజింగ్ విండో నుండి అనుమానాస్పద ప్రవర్తన గురించి ఏవైనా ఆందోళనలను రిపోర్ట్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం, మా కమ్యూనిటీ మార్గదర్శకాలు చూడండి.
వ్యక్తిగతంగా కలుసుకోవడం
హడావుడిగా ఉండకండి
కలవడానికి లేదా Tinder వెలుపల చాట్ చేయడానికి అంగీకరించే మ ుందు సమయం తీసుకోండి మరియు అవతలి వ్యక్తి గురించి తెలుసుకోండి. ఏవైనా రెడ్ ఫ్లాగ్‌లు లేదా వ్యక్తిగత డీల్‌బ్రేకర్‌ల కోసం స్క్రీన్ చేసేందుకు ప్రశ్నలు అడగడానికి భయపడకండి. కలవడానికి ముందు ఫోన్ లేదా వీడియో కాల్ ఉపయోగకరమైన స్క్రీనింగ్ టూల్.పబ్లిక్‌లో కలవండి మరియు పబ్లిక్‌లో ఉండండి
ప్రజలు ఉన్న, పబ్లిక్ ప్రదేశంలో కలవండి — మీ ఇంట్లో కానీ, మీ డేట్ యొక్క ఇంట్లో కానీ లేదా ఏదైనా ఇతర ప్రైవేట్ ప్రదేశంలో కానీ ఎన్నటికీ కలవకండి. ప్రైవేట్ ప్రదేశానికి వెళ్దామని మీ డేట్ మీపై ఒత్తిడి తెస్తే, డేట్‌ను ముగించండి.మీ ప్లాన్‌ల గురించి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు చెప్పండి
ఎప్పుడు, ఎక్కడికి వెళ్తున్నారు అనే దానితో సహా మీ ప్లాన్‌ల గురించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు చెప్పండి. మీ సెల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టండి మరియు అన్ని వేళలా మీతో ఉంచుకోండి. మీరు డేట్ కోసం బయటకు వెళ్లినప్పుడు మీరు విశ్వసించే వారితో మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి మీ ఫోన్ యొక్క అంతర్నిర్మిత ఫీచర్‌లను ఉపయోగించడాన్ని పరిగణించండి.మీ ప్రయాణాన్ని మీ నియంత్రణలో ఉంచుకోండి
మీరు మీ డేట్ వద్దకు చేరుకోవడానికి మరియు అక్కడి నుండి తిరిగి వెళ్లే ప్రయాణాన్ని మీ నియంత్రణలో ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాము, తద్వారా మీకు నచ్చినప్పుడు మీరు వెళ్లిపోవచ్చు. మీకు మీరే డ్రైవింగ్ చేస్తుంటే, రైడ్-షేర్ యాప్ లేదా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి స్నేహితుడు వంటి బ్యాకప్ ప్లాన్‌ను కలిగి ఉండటం మంచి ఆలోచన.మీ పరిమితులను తెలుసుకోండి
ప్రత్యేకించి మీపై డ్రగ్స్ లేదా ఆల్కాహాల్ యొక్క ప్రభావాల గురించి తెలుసుకోండి — అవి మీ నిర్ణయాన్ని మరియు చురుకుదనాన్ని దెబ్బతీయగలవు. డ్రగ్స్ తీసుకోమని లేదా మీకు సౌకర్యంగా ఉండే దాని కంటే ఎక్కువ మందు తాగమని మీ డేట్ మీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తే, మీ నిర్ణయానికి కట్టుబడి ఉండి, డేట్‌ను ముగించండి.డ్రింక్స్ లేదా వ్యక్తిగత వస్తువులను గమనించకుండా ఉండకండి
మీ డ్రింక్ ఎక్కడి నుండి వస్తుందో మరియు అన్ని వేళలా అది ఎక్కడ ఉందో తెలుసుకోండి — బార్‌టెండర్ లేదా సర్వర్ నేరుగా పోసిన లేదా సర్వ్ చేసిన డ్రింక్స్ మాత్రమే అంగీకరించండి. లైంగిక దాడిని సులభతరం చేయడానికి డ్రింక్స్‌లో వేసే అనేక పదార్థాలకు వాసన, రంగు మరియు రుచి ఉండవు. అలాగే, మీ ఫోన్, పర్సు, వ్యాలెట్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉండే దేనినైనా అన్ని వేళలా మీతో ఉంచుకోండి.మీకు అసౌకర్యంగా అనిపిస్తే, వెళ్లిపోండి
మీకు అసౌకర్యంగా అనిపిస్తే డేట్‌ను తొందరగా ముగించడం మంచిది. నిజానికి, అలా చేయమని ప్రోత్సహిస్తాము. మరియు ఏదో తప్పు జరుగుతోందని మీ మనసు చెబుతుంటే లేదా మీరు సురక్షితంగా లేరని భావిస్తే, సాయం కోసం బార్‌టెండర్ లేదా సర్వర్‌ను అడగండి.LGBTQ+ ప్రయాణం
ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. అన్ని జెండర్ గుర్తింపులు మరియు లైంగిక ధోరణులను కలుపుకొని పోవడాన్ని మేము నమ్ముతాము, కానీ దురదృష్టకరమైన వాస్తవం ఇది: ప్రపంచంలో ఎక్కడా సంభావ్య ప్రమాదం లేకుండా లేదు. కొన్ని దేశాల్లో LGBTQ+ వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే నిర్దిష్ట చట్టాలు ఉన్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లేటప్పుడు స్థానిక చట్టాలను సమీక్షించండి మరియు లైంగిక ధోరణి ఆధారంగా మీరు ఏ రకమైన చట్టపరమైన రక్షణ అందుబాటులో ఉందో పరిశోధించండి. మీరు అసురక్షిత ప్రాంతంలో ఉంటే, “Tinderలో నన్ను చూపించు” ఆఫ్ చేయమని మేము సూచిస్తాము, మీరు దానిని సెట్టింగ్‌లు పేజీలో కనుగొనవచ్చు. మీరు మీ ప్రొఫైల్‌కు లైంగిక ధోరణిని జోడించి ఉంటే మరియు LGBTQ+ వ్యక్తులకు అసురక్షితమైనదని మేము గుర్తించిన ప్రాంతంలో మీరు ఉంటే, మీరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లే వరకు మీ ప్రొఫైల్ నుండి మీ లైంగిక ధోరణిని మేము దాచిపెడతాము. ఈ దేశాల్లోని కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావడానికి మీరు ఎంచుకుంటే అదనపు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం - కొంతమంది చట్టాన్ని అమలు చేసే అధికారులు డేటింగ్ యాప్‌లను సంభావ్య ఉచ్చులో పడవేసే టూల్స్‌గా ఉపయోగిస్తున్నారు. కొన్ని దేశాలు స్వలింగ డేటింగ్ యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్‌లను నేరంగా పరిగణించే చట్టాలను కూడా ఇటీవల తీసుకువచ్చాయి మరియు ఆ కమ్యూనికేషన్ లైంగిక చర్యలకు దారితీసినట్లయితే జరిమానాలను కూడా తీవ్రతరం చేస్తాయి.
దేశం వారీగా తాజా లైంగిక ధోరణి చట్టాలను చూడటానికి ILGA ప్రపంచం ను సందర్శించండి మరియు వారి పరిశోధనకు మద్దతుగా విరాళం ఇవ్వడాన్ని పరిగణించండి. మూలం: ILGA ప్రపంచం, మార్చి 2019న అప్‌డేట్ చేయబడింది
లైంగిక ఆరోగ్యం & సమ్మతి
మిమ్మల్ని మీరు రక్షించుకోండి
సరిగ్గా మరియు క్రమం తప్పకుండా కండోమ్‌లను వాడితే, HIV వంటి STIలు సంక్రమించే మరియు పాస్ అయ్యే ప్రమాదాన్ని కండోమ్‌లు గణనీయంగా తగ్గిస్తాయి. కానీ, చర్మం నుండి చర్మం స్పర్శ ద్వారా పాస్ అయ్యే హెర్పెస్ లేదా HPV వంటి STIల గురించి తెలుసుకోండి. కొన్ని STIలు సంక్రమించే ప్రమాదాన్ని వ్యాక్సినేషన్ ద్వారా తగ్గించవచ్చు.మీ స్టేటస్ తెలుసుకోండి
అన్ని STIలు లక్షణాలను చూపించవు మరియు మీరు మీ స్టేటస్ గురించి చీకటిల ో ఉండకూడదు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు తరచుగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా STIల వ్యాప్తిని నిరోధించండి. ఇక్కడ మీరు మీకు సమీపంలో ఉన్న క్లినిక్‌ను కనుగొనండి (US మాత్రమే).దాని గురించి మాట్లాడండి
కమ్యూనికేషన్ అనేది సర్వస్వం: మీరు భాగస్వామితో శారీరకంగా కలిసే ముందు, లైంగిక ఆరోగ్యం మరియు STI టెస్టింగ్ గురించి మాట్లాడండి. మరియు జాగ్రత్తగా ఉండండి — కొన్ని ప్రదేశాల్లో STIని ఉద్దేశపూర్వకంగా పాస్ చేయడం నేరం. సంభాషణ ప్రారంభించడానికి సాయం కావాలా? ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.సమ్మతి
అన్ని లైంగిక కార్యకలాపాలు తప్పనిసరిగా సమ్మతితో ప్రారంభం కావాలి మరియు మీ భాగస్వామితో కొనసాగుతున్న చెక్-ఇన్‌లను కలిగి ఉండాలి. మీరు మరియు మీ భాగస్వామి ఒకరి హద్దులను మరొకరు గౌరవించేలా చూసుకోవడంలో మౌఖిక కమ్యూనికేషన్ మీకు సాయపడుతుంది. సమ్మతిని ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు మరియు సెక్స్ ఎప్పుడూ ఎవరికీ సొంతం కాదు. మీ భాగస్వామి అసౌకర్యంగా లేదా అనిశ్చితితో ఉన్నట్లు అనిపిస్తే లేదా డ్రగ్స్ లేదా ఆల్కహాల్ ప్రభావాల కారణంగా మీ భాగస్వామి సమ్మతించలేకపోతే కొనసాగవద్దు. సమ్మతి ఎలా ఉంటుంది అనే దాని గురించి మరింత చదవండి.