గైడ్

మీ IRL గైడ్

సురక్షితంగా ఉండటానికి మీకు చిట్కాలు (మీకు అటువంటి అవసరం రాదని మేం ఆశించినప్పటికీ)


చెడు ఉద్దేశ్యాలున్న కొంతమంది వ్యక్తులున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. IRLలో సురక్షితంగా ఉండటానికి సాధ్యమైనంత వరకు మీరు చేయాల్సిదంతా చేయాలని మేం కోరుకుంటాం అయితే అది అలా ఉండకూడదని మేం అంగీకరించాలని కోరుకుంటున్నాం: సురక్షితంగా ఉండటానికీ మీకు తోచిన రీతిలో మీరు బయటకు వెళ్లరాదు,కొంతమంది వ్యక్తులు వారి లింగం, లింగ గుర్తింపు, జాతి, మతం మరియు లైంగిక దృక్పథం ఆధారంగా ఇతరుల కంటే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడం అనేది పూర్తిగా అన్యాయం.

యాప్ వెలుపల ఏదైనా జరిగితే గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవిగో — మీరు ఉపయోగిస్తున్న మెసేజింగ్ సర్వీస్‌పై మిమ్మల్ని సంప్రదించకుండా వారిని బ్లాక్ చేయవచ్చు మరియు ఇంకా మాతో రిపోర్ట్ చేయవచ్చు. వారు మిమ్మల్ని అన్‌మ్యాచ్ చేసినప్పటికీ, మీరు వారిని ఇక్కడ మాకు రిపోర్ట్ చేయవచ్చు తద్వారా మేం దానిని గమనించి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ధారిస్థాం.

ఒక విషయం స్పష్టం: ఎంత తాగారు లేదా ఇంటికి తీసుకెళ్లడాన్ని వారిని ఎంతగా విశ్వసించారనే దానితో సంబంధం లేకుండా ఒకరిని అసురక్షితమైన స్థితిలో ఉంచడానికి ఎవరూ అర్హులు కాదు. ఒకవేళ ఎవరైనా మీకు విరుద్ధంగా హింసాత్మక చర్యలకు పాల్పడాలనే నిర్ణయం తీసుకుంటే, అది ఆమోదయోగ్యమైనది కాదు.

మరింత కంగారుపడకుండా, మీకు అటువంటి అవసరం రాదని మేం భావించినప్పటికీ, IRLలో మీరు సురక్షితంగా ఉండేందుకు సాయపడే కొన్ని చిట్కాలు ఇవిగో.

మీట్‌అప్‌కు ముందు

  • యాప్‌ని విడిచిపెట్టడానికి లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడానికి త్వరపడవద్దు: మీరు సౌకర్యవంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీ నెంబరు ఇవ్వండి, ఎవరైనా కొత్తవారిని తెలుసుకునేటప్పుడు మీ ఇంటి నెంబరు మరియు రోజువారీ దినచర్యను బహిర్గతం చేయవద్దు.
  • ఇతరులను లూప్‌లో ఉంచండి: మీ ప్లాన్స్ గురించి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తెలుసుకోనివ్వండి - మీరు ఎక్కడ ఉన్నారనే విషయం మీరు విశ్వసించే ఎవరైనా తెలుసుకోవడం మంచిది.
  • నియంత్రణలో ఉండండి: ఎవరైనా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఆఫర్ చేసినప్పటికీ, మీటప్‌కు మీ స్వంత రవాణా ఏర్పాటు చేసుకోండి.
  • మీరు నిజంగా తెలియని ఎవరైనా కలుసుకునేటప్పుడు ఎప్పుడూ బహిరంగ ప్రదేశాలను ఎంచుకోండి( మరియు అక్కడే ఉండండి).

మీటప్ సమయంలో

  • ఒకవేళ మీరు మాదక ద్రవ్యాలు లేదా మద్యం ఉపయోగిస్తున్నట్లయితే, అవి మిమ్మల్ని ప్రత్యేకంగా ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. దురదృష్టవశాత్తు, కొత్తమంది వ్యక్తులు దీని ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటారు.
  • మీ వస్తువులు: బ్యాగ్, ఫోన్, తాళాలు, వాలెట్, డ్రింక్ మీ దగ్గర ఉంచుకోవాలా? అన్నింటిని మీ వద్ద ఉంచుకోండి.

మీటప్ తరువాత

  • నియంత్రణలో ఉండండి: తిరిగి ఇంటికి వెళ్లడానికి మీ స్వంత రవాణా ఉపయోగించండి
  • మంచి అనుభవం కాదా? వారిని అన్‌మ్యాచ్ చేయండి- ఒకవేళ అవసరం అని మీరు భావించినట్లయితే వారిని రిపోర్ట్ చేయండి. బాధపడవద్దు

కరోనా వైరస్ సమయంలో డేటింగ్:

మళ్లీ IRLలో అనుసంధానం కావడం కొరకు మనందరం ఆతురతగా చూస్తున్నాం, కానీ మా సంఘాలను సురక్షితంగా ఉంచడం అనేది మన బాధ్యత. చిన్నపాటి సామాజిక కలయికలకు మీ వైద్య అధికారులు ఆమోదం తెలియజేసిన తరువాత, మీరు కలిసే బృందాన్ని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, దయచేసి మీ స్థానిక వైద్య అధికారుల సలహాను అనుసరించండి లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క మార్గదర్శకాలను చెక్ చేయండి. ఆ సమయం వచ్చినప్పుడు, మీరు ఏమిటి అనే దానిలో ఓపెన్‌గా ఉండండి – మరియు – ఏ విషయాల్లో మీకు సౌకర్యవంతంగా ఉండదు అనేది కూడా తెలియజేయండి. హద్దులను ఏర్పరచడం మరియు మీకు ఏది సౌకర్యవంతంగా ఉంటుంది అని మీ మ్యాచ్‌లకు ముందుగా చెప్పడటం ప్రస్తుత సమయంలో ముఖ్యమైనది. గుర్తుంచుకోండి: ఎప్పుడూ మీ భద్రత మరియు మనశ్శాంతికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయంలో సాయపడేందుకు, IRL డేటింగ్‌కు తిరిగి వచ్చేందుకు చిట్కాలు అభివృద్ధి చేయడానికిమేం పీటర్ పిట్స్, ప్రెసిడెంట్, సెంటర్ ఫర్ మెడిసిన్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ని మేం సంప్రదించాం.

  1. హీరోగా ఉండండి, మాస్క్ ధరించండి: మీరు ఎవరైనా కొత్తవారిని కలిసినప్పుడు, ఖచ్చితంగా మీ ముక్కు మరియు మీ నోటిని కవర్ చేసుకోండి. మీరు ఆ విధంగా చేయడం ద్వారా మిమ్మల్ని అదేవిధంగా మీ కమ్యూనిటీని సురక్షితంగా మరియు ఆరోగ్యవంతంగా ఉంచుతున్నారు. గుర్తుంచుకోండి: మీరు ఎలాంటి రోగలక్షణాలను కనపరచనప్పటికీ, వైరస్ వ్యాప్తి చెందవచ్చు అని అనుమానించబడుతోంది.
  2. తాకడానికి త్వరపడవద్దు: ఎదుటి వ్యక్తి ఆరోగ్య స్థితిని తెలుసుకునేంత వరకు చేతులు కలపద్దు, కౌగిలించుకోవద్దు లేదా ముద్దు పెట్టుకోవద్దు-- వారి స్నేహితులను కలుసుకునేటప్పుడు కూడా ఇదే జాగ్రత్తను పాటించండి. ఒకవేళ మీకు శారీరకంగా బాగోనట్లయితే, డిజిటల్‌గా అనుసంధానం అవ్వండి: ఈ వైరస్ వ్యక్తులను విభిన్నంగా ప్రభావితం చేస్తుంది, అందువల్ల మీకు 100% బాగున్నట్లుగా అనిపించనట్లయితే, ఫేస్‌టైమ్, జూమ్ లేదా మీకు ఇష్టమైన వీడియో మెసెంజర్ ద్వారా డేట్‌కు వెళ్లండి. మీరు లేదా మరెవరైనా జబ్బున పడేలా రిస్క్ చేయడం అంత మంచిది కాదు- మీరే ఇంటివద్ద క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసుకొని, డిన్నర్‌ని డెలివరీ చేయమని కోరవచ్చు.
  3. మీ డేట్ స్పాట్‌ని ఎంచుకునేటప్పుడు ఉద్దేశ్యపూర్వకంగా ఉండండి: వ్యక్తిగతంగా కలవడం మీకు సౌకర్యవంతంగా ఉంటుందని భావించినట్లయితే,సురక్షితమైన పరిశుభ్రత మరియు సామాజిక దూరాన్ని పాటించే ప్రదేశాన్ని మీరు ఎంచుకునేలా ధృవీకరించండి. మీతోపాటు వైప్‌లు మరియు హ్యాండ్ శానిటైజర్‌లు తీసుకొని రండి, మీరు తాకే లేదా కూర్చునే దేనినైనా తుడవండి. అలానే తరచుగా మీ చేతులను శుభ్రం చేసుకోవడాన్ని మర్చిపోవద్దు!

మీరు అస్వస్థతగా ఉన్నట్లుగా భావించడం మొదలైతే, మీ స్థానిక వైద్య అధికారుల సలహాలను పాటించండి మరియు మీరు కలిసినవారికి సాధ్యమైనంత త్వరగా తెలియజేయండి.

మరిన్ని చిట్కాలను మా వెబ్‌సైట్‌లో ఇక్కడ, కూడా కనుగొనవచ్చు.