గైడ్

సమ్మతి 101

ఇది ఏదైనా కనెక్షన్ యొక్క అవసరమైన భాగం మరియు మేం మీకు ఒక క్రాష్ కోర్సు అందించబోతున్నాం.


లైంగిక దాడి

డేటింగ్, సెక్స్‌‌లు పూర్తిగా రెండు విభిన్నాంశాలు. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తికి వారి హద్దులు మరియు ఆకాంక్షలుంటాయి — కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇలాంటి సమయాల్లో సమ్మతి ఎంతో కీలకమైనది. ఇది ఏదైనా కనెక్షన్‌కు అవసరమైన భాగం, మేం దీనిపై మీకు ఒక క్రాష్ కోర్సు అందించబోతున్నాం.

సమ్మతి అనేది నిజంగా చాలా సరళమైనది. ఏదైనా సన్నిహిత కార్యకలాపానికి అనుమతి పొందడం అని దీని అర్ధం. కొన్నిసార్లు సమ్మతి మాటల్లో, కొన్నిసార్లు చర్యల్లో వివరించబడుతుంది. విషయం ఏమిటంటే, మీరు ఎవరినైనా వ్యక్తిగతంగా కలుస్తుంటే, మీరు వారికి హద్దులకు గౌరవించే బాధ్యత మీపై ఉంటుంది, మరియు వారి మీ హద్దులను గౌరవించాలి. ఒకవేళ మీకు స్పష్టంగా తెలియనట్లయితే, వారు ఏ విషయంలో సౌకర్యవంతంగా ఉంటారనేది అడగండి.

ఒకవేళ ఎవరినైనా కలుస్తున్నట్లయితే, గుర్తుంచుకోండి: ఏదైనా లైంగిక కార్యకలాపం జరగడానికి ముందు మీరు విధిగా సౌకర్యవంతంగా ఉండాలి మరియు క్రియాత్మకంగా సమ్మతి తెలియజేయాలి. మీరు వారితో తరువాత దశకు వెళ్లాలని అనుకున్నట్లయితే, ఈ మార్గంలో ప్రతిదశలోనూ మీరు విధిగా వారి సమ్మతి పొందేట్లుగా ధృవీకరించుకోవాలి.

వీటిని మనస్సులో పెట్టుకోండి:

  • చట్టపరమైన నిర్వచనాలు మారవచ్చు, అయితే లైంగిక వేధింపులు అనేవి బాధితుడి సమ్మతి లేకుండా జరిగే ఏదైనా లైంగిక సంపర్కం లేదా కార్యక్రమాన్ని తెలియజేస్తుంది. లైంగిక వేధింపుల్లో అత్యాచారం, సమ్మతి లేకుండా లైంగికంగా తాకడం, లేదా ఓరల్ సెక్స్ చేయడం లేదా పొందడం వంటి బలవంతపు చర్యలు సహా ఉంటాయి.
  • ఒక వ్యక్తి మానసికంగా లేదాా శారీరకంగా అసమర్థుడైతే లేదా మాదక ద్రవ్యాలు లేదా మద్యం యొక్క ప్రభావం కింద వైకల్యతను కలిగి ఉన్నట్లయితే వారు సమ్మతిని ఇవ్వలేరు- ఎందుకంటే వారు వాస్తవం, స్వభావం లేదా పరిస్థితి పరిధిని అర్థం చేసుకోలేరు.
  • సమ్మతి ఎలాంటి భయం, ఒత్తిడి లేదా బెదిరింపులు లేకుండా ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఇచ్చేది. నేరస్థులు ఎప్పుడూ శారీరక శక్తిని ఉపయోగించరు, వారు బెదిరింపులు, తారుమారు చేయడం లేదా బలవంతం చేయడం చేయవచ్చు.
  • మీరు ‘‘లేదు’’ అని చెప్పే హక్కు ఎప్పుడూ ఉంటుంది. ‘‘లేదు’’ అనేది లేకపోవడం సమ్మతించడం కాదు. ఒకవేళ ఎవరైనా అసౌకర్యంగా లేదా సంకోచంగా ఉన్నట్లుగా చూస్తే, వారు ఎలా భావిస్తున్నారని అడగండి, వారు స్థిమితపడే మార్గాన్ని అందించండి. ‘‘బహుశా’’ అనేది ఎల్లప్పుడూ ‘‘లేదు’’ అనే అర్ధాన్ని ఇస్తుంది.
  • ఒకవిధమైన లైంగిక కార్యకలాపానికి ‘‘అవును’’ అని చెప్పడం అంటే మరోదానికి కూడా ‘‘అవును’’ అని చెప్పినట్లు కాదు. సమ్మతి అనేదిమీరు ఒకేసారి ఇచ్చే విషయం కాదు —ఇది మీరిద్దరూ కలిసి మీ కాలం అంతటా కూడా నిరంతరం తనిఖీ చేసే ప్రక్రియ ఇది. ప్రాథమింగా సమ్మతి తెలియజేసిన తరువాత కూడా, మరో వ్యక్తి తన మనస్సు మార్చుకొని, లేదు అని చెప్పవచ్చు- మీరు కూడా ఇలా చేయవచ్చు.

సమ్మతి కొరకు అడగడం

సమ్మతి ఎల్లప్పుడూ మౌఖికంగా ఉండాల్సిన అవసరం లేదు, అయితే విభిన్న లైంగిక కార్యకలాపాలకు మౌఖిక అంగీకారం అనేది మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ ఒకరినొకరి హద్దులను గౌరవించుకునేందుకు సాయపడుతుంది. మౌఖిక సమ్మతిలో ‘‘అవును’’, ‘‘ఆపవద్దు’’ లేదా మీరు ఏమిి కోరుకుంటున్నారని మీ భాగస్వామికి చెప్పడం సహా ఉండవచ్చు. మౌఖికేతర సమ్మతికి కొన్ని ఉదాహరణల్లో తల ఊపడం, ఎవరినైనా దగ్గరకు లాక్కోవడం, లేదా పరస్పరం తాకడం వంటి వాటిలో చురుగ్గా నిమగ్నం కావడం సహా ఉంటాయి.

మీరు కొత్త భాగస్వామితో ఉన్నప్పుడు నాన్ వెర్బల్ సంకేతాలు అంత స్పష్టంగా ఉండవనే విషయాన్ని గుర్తుంచుకోండి, అందువల్ల మీకు ఎవరైనా బాగా తెలిసేంత వరకు మౌకి సమ్మతిని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటుంది. దానితోపాటు, సమ్మతి అడగడం సెక్సీగా ఉంటుంది. సమ్మతి ఎల్లప్పుడూ స్పష్టంగా, ఉత్సాహంగా మరియు లైంగిక కార్యకలాపాలు కొనసాగుతున్నంత సేపు ఉండాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిఒక్కరూ కూడా జరుగుతున్న విషయాలతో సౌకర్యవంతంగా భావించడం మరియు ప్రతిదశలో ముందుకు సాగేటప్పుడు ఆ సౌకర్యవంతంగాఉండటాన్ని తెలియజేయడం నిజంగా ముఖ్యం.

సమ్మతి అనేది కేవలం లైంగిక కార్యకలాపానికి మాత్రమే పరిమితం కాదనే విషయాన్ని మదిలో పెట్టుకోండి —మీరు ఒకరినొకరి కంఫ్టర్ లెవల్స్ గురించి తెలుసుకున్నట్లుగా మరియు వీటికి సంబంధించి మీరు స్పష్టమైన హద్దులు సృష్టించినట్లుగా ధృవీకరించుకోవడానికి శారీరకంగా తాకడంపై పరస్పర ఆసక్తి నెలకొల్పడానికి పని చేయండి. మాదక ద్రవ్యాలు లేదా మద్యం మత్తులో ఉండేవారు సమ్మతి తెలియజేయలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.

సమ్మతి ఇవ్వడం

ఏదైనా రకం యాక్టివిటీతో మీరు సౌకర్యవంతంగా భావించనట్లయితే, మీరు ఆ విధంగా చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఒత్తిడి చేసే హక్కు ఎవరికి లేదు. మీ ఉద్దేశ్యాల గురించి స్పష్టంగా ఉండండి ఏ డేట్‌కు కూడా (లేదా ఎవరైనా) మీ సరిహద్దులను ముందుకు నెట్టే హక్కు లేదని తెలుసుకోండి—మరియు మీరు ఎవరిని కూడా ఇలా ముందుకు నెట్టరాదు.

మీరు ఏదైనా లైంగిక కార్యక్రమంలో నిమగ్నం కావాలని భావిస్తున్నట్లయితే, మీకు ఏది బాగా పనిచేస్తుందనే విషయం ఎదుటి వ్యక్తికి తెలియజేయండి —విషయాలు ముందుకు సాగుతున్నప్పుడు మౌఖికంగా తనిఖీ చేయడం వంటి ప్రస్తుత సమ్మతిని ఇద్దరూ కమ్యూనికేట్ చేసుకునే మార్గాలను కనుగొనండి. ఒక నిర్ధిష్ట లైంగిక చర్య గురించి ఎదుటి వ్యక్తి ఆసక్తిగా ఉన్నాడా అని మీకు స్పష్టంగా తెలియనట్లయితే, వారిని అడగండి. ‘‘లేదు’’ అని చెప్పకపోవడం ‘‘అవును’’ కాదని గుర్తుంచుకోండి.